జగన్ మరో సంచలన నిర్ణయం; ఆయన సస్పెండ్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ లు లేవు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించిన నగిరి మున్సిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డిని సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నో ఆగ చాట్లు పడి చేస్తున్నాం… ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు. అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మాస్క్ లు రాలేదు. పీపీఈ డ్రెస్ లు రాలేదు. గ్లౌజ్ లు లేవు, బూట్లు లేవని…

చిత్తూరు జిల్లా నగిరి మున్సిపల కమీషనర్ ఇటీవల సేల్ఫీ వీడియో విడుదల చేసారు. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచరిత వ్యాఖ్యలు చేసారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కార్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విశాఖ జిల్లాకు చెందిన ఒక డాక్టర్ ని కూడా ఇదే విధంగా సస్పెండ్ చేసారు.

ఆయన ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా రోగులకు చికిత్స చేయడం లేదని ఆరోపిస్తూ ఆయన్ను పక్కకు తప్పించారు. ఈ వ్యవహారాలూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తల నొప్పిగా మారాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొందరు వైద్యులు విధులు బహిష్కరిస్తామని ముందుకి వచ్చారు. తమకు ఏ విధంగా కూడా రక్షణ లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా అయితే ఉద్యోగాలు చేయమని ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version