ఆర్జీవీ మర్డర్‌ సినిమా నిలిపివేతకు నల్గొండ జిల్లా కోర్టు ఆదేశాలు

-

రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న మర్డర్ సినిమాకు సంబంధించిన కేసు విచారణను… నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు పూర్తి చేసి కీలక తీర్పును ఇచ్చింది.మర్డర్‌ సినిమా నిలిపివేయాలని నల్గొండ జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిర్యాలగూడ అమృత, ప్రణయ్,​ మారుతీరావు ఘటనపై రామ్​గోపాల్​వర్మ చిత్రం చివరికి ఈ విధంగా ముగిసింది.ఈ దుమారం రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన ఓ ఫోటోతో మొదలు అయింది.

ఓ తండ్రి కుమార్తెను అతిగా ప్రేమిస్తే ఎంత ప్ర‌మాద‌మో తెలిపే అమృత‌, మారుతీరావు క‌థ‌తో తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రం హృద‌యాల్ని క‌దిలిస్తుంది. శాడ్ ఫాద‌ర్స్ ఫిల్మ్ పోస్ట‌ర్‌ను ఫాద‌ర్స్ డే రోజున విడుద‌ల చేస్తున్నా” అని వ‌ర్మ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇదే విషయమై అమృత స్పందించారంటూ ఓ పోస్ట్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేయడం వల్ల.. “కొంద‌రిని చెడుగా చూపించ‌డానికి నేను ఈ సినిమాను తీస్తున్నాను అనుకోవ‌డం సరికాదు. ఎందుకంటే.. ఏ వ్య‌క్తి చెడు కాదని నేను గ‌ట్టిగా న‌మ్ముతా. కేవ‌లం ప్ర‌తికూల‌ ప‌రిస్థితులు వ్య‌క్తిని చెడ్డ‌వాడిని చేస్తాయి. అలా ప్ర‌వ‌ర్తించేందుకు కార‌ణ‌మౌతాయి. దీన్నే నేను ‘మ‌ర్డ‌ర్’లో చూపించాలి అనుకుంటు‌న్నా. ఆ ప్ర‌క‌ట‌న రాసిన వారికి నేను చివ‌రిగా ఒక‌టి చెబుతున్నా.. మ‌నుషుల‌పై, వారి ఫీలింగ్స్‌పై నాకు గౌరవం ఉంది. వారు ప‌డ్డ బాధ‌ను, నేర్చుకున్న పాఠాన్ని గౌర‌విస్తూ మ‌ర్డ‌ర్ తీయ‌బోతున్నా” అని వ‌ర్మ ఈ సినిమా గురుంచి మొదటి లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news