ఆంధ్రప్రదేశ్ లో జగన్ సిఎం అయిన తర్వాతి నుంచి రివర్స్ టెండరింగ్ ఎక్కువగా జరుగుతుంది. కాంట్రాక్ట్ సంస్థలను ఈ రివర్స్ టెండరింగ్ పద్ధతి మారుస్తుంది ఏపీ ప్రభుత్వం. విపక్షాల నుంచి అభ్యంతరాలు వినపడినా సరే వెనక్కు తగ్గలేదు సిఎం వైఎస్ జగన్. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఇక నుంచి ఏపీలో ప్రతీ విభాగంలో కూడా రివర్స్ టెండరింగ్ చేయాలని ఆదేశాలు వచ్చాయి.
కోటి దాటిన ప్రతీ ప్రాజెక్ట్ లో కూడా రివర్స్ టెండరింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు, కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్ట్ పనుల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనపడింది. నేటి నుంచి ఇది అమలులోకి రానుంది.