చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్క ఓటుకి 2000 నుండి 3000 ఇస్తాం అంటున్నారు. బంగారంగా తీసుకోండి. ఓటు మాత్రం ఫ్యాన్ కి వెయ్యండి అని పిలుపునిచ్చారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా విడవలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైయస్సార్ ఆసరా కింద నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు పగటి వేషగాడి లాగా వ్యవహరిస్తూ ప్రజల్ని మోసం చేస్తాడడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించారు ఐదు ఏళ్ళు కొత్త రాష్ట్రంలో పరిపాలించారు. వాగ్దానాలు చేయడం ఓట్లు వేయించుకోవడం అధికారంలో వచ్చిన తర్వాత మోసం చేయటం పరిపాటిగా మారిందని అన్నారు. చంద్రబాబు హయాంలో కుటుంబాలు బాగుపడ్డాయా జగన్మోహన్ రెడ్డి లాగా సంక్షేమ పథకాలు ఇచ్చారా అని నిలదీశారు.