మంచి మనసు చాటుకున్నారు నందమూరి బాలకృష్ణ. జగిత్యాల, కామారెడ్డి జిల్లాల వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఈ మేరకు తాజాగా నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేసారు. దింతో నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కాగా నిన్న ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’.. పురస్కారం అందుకున్న బాలకృష్ణ.. రికార్డు సృష్టించాడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య…. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో పురస్కారం అందుకున్నాడు. ఈ కార్యక్రమానికికేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి నారా లోకేశ్, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ తరుణమేలోనే జగిత్యాల, కామారెడ్డి జిల్లాల వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ.
తెలంగాణ సీఎం సహాయక నిధికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ
రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సహాయంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ pic.twitter.com/bd9U0isKEj
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2025