పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ నటి నేహా శెట్టి నటించనుంది. డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి ఓజీ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నేహా శెట్టి ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో చెప్పారు.

అయితే ఆ సినిమాలో ఈ బ్యూటీకి ఎలాంటి పాత్రను ఇచ్చారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో నేహా శెట్టి ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రాకపోవడంతో డీలా పడిపోయింది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో తన అభిమానులు సంతోషపడుతున్నారు. ఈ సినిమాతోనైనా నేహా శెట్టికి వరుసగా సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు.