బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆసుపత్రి ఛైర్మన్, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు, శ్రీ నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అందరిని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు. ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛ వాయువులు ఎందరో త్యాగ ఫలితమన్నారు బాలకృష్ణ.

ఇది ఇలా ఉండగా… గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్‌ లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ నేరుగా.. గోల్కొండ పోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం అందుకున్నారు సీఎం కేసీఆర్‌. అనంతరం.. గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ తో పాటు.. తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version