ఆసక్తి రేపుతున్న నంద్యాల డెయిరీ ఎన్నికలు

-

కర్నూలు జిల్లా నంద్యాల విజయడెయిరీ ఎన్నికలు రోజుకో ట్విస్ట్ తో ఉత్కంఠ ‌రేపుతున్నాయి. ఈరోజు ఎన్నిక జరగనుండటం వైసీపీ-టీడీపీ ప్రతి ప్యూహాలతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈ ఎన్నికలో తలపడేది మాత్రం బంధువర్గం రిత్యా ఒక కుటుంబానికి చెందినవారే కావడం కర్నూలు రాజకీయాల్లో ఆసక్తిరేపుతుంది.

డెయిరీ డైరెక్టర్ గా పోటీ చేస్తూన్న టిడిపి పార్టీ బలపరిచిన మల్లికార్జున అనే వ్యక్తి వైసిపి పార్టీ బలపరిచిన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం పై అభ్యంతరంతో పాటు ఎన్నికల అధికారి అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల అవతవకల పై హైకోర్టులో పిటిషన్ వేశారు.సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ వేసిన మల్లికార్జున నాటకీయ పరిణామాల మద్య కేసు వాపస్ తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణ పై ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తి వేసింది.

నంద్యాల విజయ డెయిరీ మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 81 మంది ఉండగా… ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, అనంతరం ఛైర్మన్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

అధికార వైసీపీ విజయ డెయిరీ మూడు డైరెక్టర్ల తో పాటు ఛైర్మన్ పదవి చేజిక్కించుకోడాని తీవ్రంగా ప్రయత్నిస్తూంది.గత 25 సంవత్సరాల కాలంగా ఛైర్మన్‌గా కొనసాగుతున్న టిడిపి పార్టీ మద్దతు దారుడు భూమా కుటుంబ సభ్యుడు భూమా నారాయణ రెడ్డి ‌తన పదవిని దక్కించుకుంటాడా లేకా అధికార‌ పార్టీ తన హవాతో తమ మద్దతుదారుడైన ఎస్వీ జగన్మోహన్ ‌రెడ్డిని ఛైర్మన్‌ సీటులో కూర్చోబెడుతుందా అనేది ఈరోజు తేలనుంది. ఎస్వీ జగన్మోహన్ రెడ్డి భూమా అఖిలప్రియకి సొంత మేనమామ కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version