రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలు చేయమంటూ మరో ప్రొసీడింగ్స్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో పక్క మా స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు చేర్చమంటే చేర్చలేదని స్వయానా నిమ్మగడ్డ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
నా ఇల్లు దుగ్గిరాలలో ఉన్నా ఓటు హక్కు కల్పించడం లేదని ఆయన పేర్కొన్నారు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్, రాజ్యాంగ స్ఫూర్తికి మంత్రుల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అధికార పార్టీ పెద్దలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఉద్యోగ సంఘాల మాటలు మనసులో పెట్టుకోలేదు అని పేర్కొన్న ఆయన, ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ అంతా నడిపింది కమిషనర్ గిరిజాశంకరే అని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ కక్ష తీర్చుకోవడం లాంటివి చేయదని పేర్కొన్నారు.