ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా హిట్ లేదా ప్లాప్తో సంబంధం లేకుండా చాలా చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ హిట్ కావడంతో పాటు మంచి మూవీగా నిలిచింది. నాని కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా ఉంది. క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో నడిచే ఈ స్పోర్ట్స్ లవ్ డ్రామా మూవీ 2019లో విడుదలైంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ,చాలా ప్రశంసలను దక్కించుకుంది.
చాలా మంది ప్రేక్షకుల మనసుల్లోనూ మంచి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో నాని నటన మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. మూవీ విడుదలై ఐదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ప్రత్యేక షోలు వేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఈ నెల 20న ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.జెర్సీ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. క్రికెట్, లవ్ స్టోరీ, తండ్రీకొడుకుల ఎమోషన్ లాంటి అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. జెర్సీ సినిమాకి గాను 2021 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ ఎడిటర్ పురస్కారం నవీన్ నూలి సొంతం చేసుకున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మించారు.