చిరంజీవి మాటలు విని కన్నీరు ఆగలేదు : ప్రశాంత్ వర్మ

-

ఈ ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన హనుమాన్ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా విజయం సాధించడంలో చిత్ర యూనిట్ లో ప్రతీ ఒక్కరి కృషి ఉంది. ముఖ్యంగా తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు క్రెడిట్ ఇవ్వాలి. ప్రస్తుతం హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ పేర్లు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్నాయి. 

ఈ సినిమాకు మొదటి నుంచి సపోర్టుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా మరోసారి హనుమాన్ మూవీ పై హీరో తేజా సజ్జా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నేను నటించాలనే కలల చిత్రం హనుమాన్ అనే మాటలు పద్మవిభూషణ్ చిరంజీవి నోటి వెంట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు నా భుజాలపై మరింత బాధ్యతను పెంచాయి. మెగాస్టార్ నుంచి ఈ మాటలను నేను ఎప్పటికీ గౌరవిస్తాను. ఈ వీడియో చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news