ఏపీలో ఇప్పుడు చర్చ అంతా స్థానిక ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దం కావడంతో ప్రభుత్వం మళ్ళీ నిమ్మగడ్డ మీద కామెంట్స్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఇప్పట్లో ఈ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని తెలిపారు. ఈరోజు మంత్రి కొడాలి నాని కూడా అలాంటి కామెంట్సే చేశారు. రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నాడని, అది సరైన చర్య కాదని అన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కొన్ని నెలల మాత్రమే ఉంటాడని తరువాత రిటైర్డ్ అయ్యి హైదరాబాదు లో ఉంటాడని ఆయన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని అయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదన్న ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ ఏమీ చెయ్యలేరని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టి లో ఉంచుకుని , స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని అన్నారు. అలానే బీహర్ ఎన్నికలతో స్థానిక సంస్థలు పోల్చకూడదని కొడాలి నాని అన్నారు.