బీహార్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అభ్యర్థులందరూ ముమ్మర ప్రచారం చేస్తూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకునే పనిలో పడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష అధికార పార్టీ అధిష్ఠానాన్ని సైతం రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల వద్దకు చేరి హామీల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవాలంటూ తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. తన తండ్రి త్వరలో బెయిల్ పై విడుదల చేయనున్నారని దీంతో ఆయన రాగానే ముఖ్యమంత్రి పదవి ఆయనకు అప్పజెప్పి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అంటూ సూచించారు. నవంబర్ 9వ తేదీన తన తండ్రికి బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు అంటూ తెలిపారుమ్ తేజస్వి యాదవ్. కాగా ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.