ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా వైయస్సార్సిపి ఒంటరిగా బరిలోకి దిగుతుందని అన్నారు.తమది పోరాటం అయితే టిడిపి- జనసేన పార్టీలది వావీవరుసలు లేని ఆరాటం అని పేర్కొన్నారు.బీజేపీని అనరాని మాటలు అన్నారని, తిరిగి ఆ రెండు పార్టీలు తిట్టిన పార్టీతో పొత్తుకు ఆరాట పడుతున్నాయన్నారు.బీజేపీతో కలిసి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూర్చారో చెప్పాలన్నారు.
ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై స్పందించారు.ఆయనను తాము కన్సల్టెంట్ గానే నియమించుకున్నామని చెప్పారు.ఆయన చెప్పిన వాటన్నింటిని చేయాలనే నిబంధన ఏదీ లేదని చెప్పారు.కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.జాతీయ రాజకీయాలపై మొదటినుంచి జగన్ ది ఒకటే విధానమన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఎవరైతే ప్రకటిస్తారో వారికే జగన్ మద్దతు ఇస్తారని చెప్పారు.మరోవైపు చిరంజీవిపై పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు.వ్యక్తిగతంగా ఆయన మనసు చాలా మంచిది అన్నారు.ఆయనకు పవన్ కళ్యాణ్ కు చాలా తేడా ఉందని అన్నారు.