రిపబ్లిక్ సినిమా చూస్తా..నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా రిపబ్లిక్. ఈ సినిమా శుక్రవారం విడుదల చేయగా మిశ్రమ స్పందన వస్తోంది. ఈ చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహించగా.. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. నిజ జీవితంలో ఉండే రాజకీయాలకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించారని రివ్యూలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా చూస్తాను అని టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

రిపబ్లిక్ సినిమా పై గొప్పగా రివ్యూలు వస్తున్నాయని.. సాయి ధరమ్ తేజ్ దేవకట్టా ల కాంబినేషన్ లో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. నా లోకేష్ చేసిన ట్వీట్ తో ఈ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నారా లోకేష్ ఎలాంటి రివ్యూ ఇస్తారో చూడాలి మరి.