TDP అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ నాయకులు నారా లోకేష్. ఇవాళ తిరుపతిలో పాదయాత్ర చేస్తున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, తాము అధికారం లోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఆ రెండు పథకాలు యూజ్‌లెస్ అన్నారు.
నేండ్రగుంట వద్ద యువకులతో ముఖా ముఖిలో మాట్లాడారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేసి కళాశాలలకే నేరుగా ఫీజులు వేస్తామన్నారు. అ రెండు పధకాలు వల్లా విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..టిడిపి వస్తే అ ఆవేదన తల్లిదండ్రులు లేకుండా చేస్తామన్నారు నారా లోకేష్.