సొంత బాబాయ్‌నే వేసేసినోళ్లు.. బుచ్చ‌య్య తాత‌ని గౌర‌విస్తారా ?

-

సొంత బాబాయ్‌నే వేసేసినోళ్లు.. బుచ్చ‌య్య తాత‌ని గౌర‌విస్తారా ? అని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. టిడిపి ఎమ్యెల్యేలపై జరిగిన దాడి ఘటన పై నారా లోకేష్ స్పందించారు. ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కి నిలువెత్తు సంత‌కంలా నిలిచే సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య పై ప్ర‌జాస్వామ్య దేవాల‌యం అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగ‌బ‌డ‌టం దారుణం అని నిప్పులు చెరిగారు.

బుచ్చ‌య్య తాత‌పై దాడి దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లోనే బ్లాక్ డే. ఏడుప‌దుల వ‌య‌స్సు దాటిన పెద్దాయ‌న‌ని చూస్తేనే..చేతులెత్తి న‌మ‌స్క‌రించాల‌నిపిస్తుందన్నారు లోకేష్. దాడికి మీకు మ‌న‌సు ఎలా ఒప్పింది? అధికారం కోసం సొంత బాబాయ్‌నే వేసేసినోళ్లు, బుచ్చ‌య్య తాత‌ని గౌర‌విస్తార‌నుకోవ‌డం వృథా ప్ర‌యాస‌ అంటూ మండిపడ్డారు నారా లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌ర్రుకాల్చి వాత పెట్టినా ఫ్యాక్ష‌న్ బుద్ధి మార‌లేదన్నారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version