తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రాంత వాసులు మరో 24 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కొన్ని ప్రాంతాలలో ఆస్తి నష్టం సంభవించింది. ఇక రాబోయే మరో 24 గంటలలో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

దీంతో తెలంగాణ ప్రాంత వాసులు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేయాలి అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా….మరో 24 గంటల పాటు హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక అటు రేపు కృష్ణాష్టమి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో హాలిడే కూడా విద్యార్థులకు ప్రకటించారు.