గోదావరి జిల్లాల్లో మమకారం, వెటకారం రెండూ అద్భుతమే : లోకేశ్‌

-

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉందని నారా లోకేశ్ అన్నారు. గోదావరి జిల్లాల్లో మమకారం, వెటకారం అద్భుతమే అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది పోలవరం స్థాయి అయితే జగన్ మురికికాలువ స్థాయంటూ విమర్శలు గుప్పించారు. సామాన్యులకు తిరుమల శ్రీవారిని దూరం చేసి.. TTDని రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్ మార్చారని ఆరోపించారు.

J టాక్స్ రూపంలో ప్రజల రక్తాన్ని తాగుతున్నారని జంగారెడ్డిగూడెం సభలో విమర్శించారు. జగన్‌ పాదయాత్రను ఎప్పుడూ అడ్డుకోలేదు. పైగా భద్రత కల్పించాం. నేను పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. చంద్రబాబుది పోలవరం స్థాయి.. జగన్‌ది మురికికాలువ స్థాయి. సామాన్యులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన వ్యక్తి జగన్‌. తితిదేను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. వైఎస్‌ కుటుంబసభ్యులే జగన్‌ను నమ్మడం లేదు. జే ట్యాక్స్‌ రూపంలో జగన్‌ ప్రజల రక్తం తాగుతున్నారు’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

 

ఇదిలా ఉంటే.. రాఖీ పండుగను పురస్కరించుకొని అక్క చెల్లెమ్మలకు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. సొంత అక్కాచెల్లెళ్లు లేని తనకు ల‌క్షలాది మంది తోబుట్టువుల‌ను దేవుడు ఇచ్చాడు అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర  సంద‌ర్భంగా ప్ర‌తీ ఊరిలోనూ తన అక్కాచెల్లెళ్లు రాఖీలు క‌ట్టారని వారి ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ మరచిపోలేనని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version