TSEAMCET విద్యార్థులకు అలర్ట్‌.. సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిష‌న్లు..

-

తెలంగాణ ఎంసెట్ అడ్మిషన్లకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 1న కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగు అవకాశం కల్పించామని.. అదే రోజున కాలేజీలు స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్లు ఇస్తాయని తెలిపింది. బీటెక్‌ మొదటి సంవత్సరంలో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్‌ ద్వారా సీట్లు మార్చుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

ఇలాంటి వారు సెప్టెంబర్ 1న స్లైడింగ్‌లో పాల్గొనాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇక సెప్టెంబర్‌ 1న కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ జారీచేయాలని, సెప్టెంబర్‌ 2న ఖాళీల వివరాలను ప్రకటించి 3, 4 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు పూర్తిచేయాలని సూచించారు. ఇక ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 18,815 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం https//tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version