గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. ఈ అమానుష ఘటనపై టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్వంసం చేసినంత మాత్రాన ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదని, ప్రజల హృదయాల్లో కొలువైన దైవం అని అన్నారు. విగ్రహాలు లేకుండా చేయడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చేయగలమని సీఎం జగన్, వైసీపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చెయ్యడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చెయ్యగలమని సైకో మనస్తత్వంతో @ysjagan గారు, వైకాపా నాయకులు అనుకుంటున్నారు.(1/2) pic.twitter.com/YvplFnsVti
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 21, 2020
కాగా, గతంలో నెల్లూరు జిల్లాలోని కావలిలో సైతం ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా స్పందించారు. మరి ఈ తాజా ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.