ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డు : నారా లోకేశ్

-

టిడిపి అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న ఆయన, అధికారంలోకి వచ్చాక అవన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆటో డ్రైవర్లతో లోకేష్ సెల్ఫీ దిగారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో భాగంగా ఈరోజు ఆటో యూనియన్ ప్రతినిధులతో కలిసినప్పుడు వారిలో 80 శాతం మంది ఆటో డ్రైవర్లకు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న వాహన మిత్ర రావడం లేదని చెప్పారు. కారణం చాలామంది ఆటో డ్రైవర్లు అద్దె ఆటోలు నడుపుకుంటున్నారన్నారు.

పైగా ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం వలన ట్రాఫిక్ పోలీసులు ఈ-చలానాల పేరుతో వేధిస్తున్నారని, తమకు వచ్చే ఆదాయం ఆటో అద్దె, ఫైన్లు కట్టడానికి సరిపోతుందని, ఇళ్లు గడవని పరిస్థితి ఉందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసారు. పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ప్రభుత్వం పన్నులు కూడా పెంచిందన్నారు
బాగా చదువుకుని కూడా ఉద్యోగాలు లేక ఆటో నడుపుకుంటున్నామని యువకులు చెప్పారు. తమకు ఇన్స్యూరెన్స్ కానీ ఇతర సదుపాయాలు కానీ ప్రభుత్వం నుండి అందడం లేదని వాళ్ళు చెప్పారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే దిశగా టీడీపీ అధికారంలోకి రాగానే ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news