చంద్రబాబు వారసుడిగా టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ ఎమ్మెల్సీగా పాలిటిక్స్ లో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల టైంలో టీడీపీ గెలిచిన తర్వాత పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎంట్రీ ఇచ్చిన నారా లోకేష్ రెండు శాఖలకు మంత్రిగా పని చేయడం జరిగింది. కానీ చాలా సార్లు మీడియా ముందే నవ్వుల పాలు అవ్వడం జరిగింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న టైములో నారా లోకేష్ పొరపాటున మాట్లాడిన ప్రసంగాలు ప్రత్యర్థి పార్టీలు హైలెట్ చేసి చూపించడంతో ప్రజలలో నారా లోకేష్ చాలా పలచన పడ్డారు. ముఖ్యమంత్రి కొడుకుగా చాలా మంది ఎంట్రీ ఇచ్చిన, ప్రజాక్షేత్రంలో నిరూపించుకున్నది జగన్ అని చెప్పవచ్చు.
దీంతో నారా లోకేష్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో టిడిపి పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజకీయంగా పైకి రావాలంటే నారా లోకేష్ పార్టీ నేతలకు మరియు సామాన్య కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ నాయకులు ఈ సందర్భంగా చాలా మంది కోరుతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ఆ ట్విట్టర్ ముసుగు తీసేసి బయట ప్రపంచానికి కనపడాలని అంటున్నారు. సోషల్ మీడియా నుండి బయటికి వస్తే గాని నారా లోకేష్ ప్రజాక్షేత్రంలో తనేంటో నిరూపించుకునే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. తెలుగు రాజకీయాల్లోనే మంచి భవిష్యత్తు క్యాడర్ కలిగిన టీడీపీకి నారా లోకేష్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి అండగా ఉండాలని కోరుతున్నారు.