చినబాబు స్పందిస్తున్నారు…. మహారాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత గుర్తుచేస్తున్నారు!

-

గతకొంతకాలంగా ప్రజా సమస్యలపట్లా.. ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలోనూ.. ఇక సామాజికంగా రాజకీయంగా అన్ని విషయాల్లోనూ లోకేష్ స్పందిస్తున్న విధానం చూస్తుంటే… ఆయన ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకోవాలనిపిస్తుందంటున్నారు ఆయన అభిమానులు! అధికారంలో ఉన్నన్ని రోజులూ తన గురించి, తన వారి గురించి మాత్రమే ఆలోచించిన లోకేష్… ఒక్కసారి కుర్చీ మారేసరికి.. అన్ని విషయాలపైనా స్పందిస్తున్నారని, ఈ ఆలోచన 13నెలల క్రితమే ఉండి ఉంటే.. ఫలితాలు ఇలా ఉండేవి కాదని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్!

ప్రజాసమస్యలపైనా, రాజకీయ విమర్శలపైనా ఇంతకాలం ఏపీ ముఖ్యమంత్రికి, ఏపీ మంత్రులకు ట్వీట్లద్వారా స్పందన తెలియజేసిన నారా లోకేష్… తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రిక్వస్ట్ ట్వీట్ పెట్టారు! అదేమిటంటే… వరవరరావు ఆరోగ్యం గురించి! అవును… “ప్ర‌సిద్ధ ర‌చ‌యిత‌, విర‌సం నేత వర‌వ‌ర‌రావు గారికి మెరుగైన వైద్యం అందించాల‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగారికి విన్న‌విస్తున్నాను. వృద్దాప్య, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ప్ర‌స్తుతం జేజే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వ‌ర‌వ‌ర‌రావుకి అత్యాధునిక వైద్యం త‌క్ష‌ణ‌మే అందించాల‌ని మ‌హారాష్ట్ర సీఎం గారిని కోరుతున్నాను” అంటూ లోకేష్ ట్వీటారు!

ప్రతిపక్షంలో కూర్చునే సరికి అందరినీ కలుపుకోవాలని.. చిన్నదైనా పెద్దదైనా అన్ని విషయాలలోనూ స్పందిచే లక్షణాన్ని అలవాటు చేసుకోవాలని.. నాయకుడు అనేవాడికి అది ప్రాథమిక లక్షణం అని లోకేష్ గుర్తించినట్లున్నారు! మంత్రిగా పనిచేసినంత కాలం మచ్చుకు ఒక్కసారైనా కనిపించని ఆ లక్షణం.. తాజాగా పునికిపుచ్చుకోవడంతోపాటు.. దాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. కాకపోతే… స్పందించే విషయంలో కూడా నెటిజన్లకు అడ్డంగా దొరక్కుడదని, విమర్శకుల లాజిక్ లకు సమాధానం చేప్పేవిగా ఉండాలని అంటున్నారు!

దానికి కారణం… జైల్లో ఉన్నప్పుడు వరవరరావు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆ విషయం తెలిసిన వెంటనే… మహారాష్ట్ర సీఎంకు, హోం కు లోకేష్ విన్నవిస్తే బాగుండేది. ఆ క్రెడిట్ కూడా దక్కేది. ఎందుకంటే.. జైల్లో ఉన్న వ్యక్తికి వైద్యం అందించమని చేసే రివక్స్ట్ లో అర్ధం ఉంది. కానీ… ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి సరైన వైద్యం అందించమని అడగడంలో అర్ధం లేదు అనేది కొందరి మాట! ఆమాత్రం ఆలోచన, బాధ్యత, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉండదా అనేది మరో ప్రశ్న! ఏమిటో లోకేష్… రాష్ట్రంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి సర్… జనాల ఆవేదన!!

Read more RELATED
Recommended to you

Exit mobile version