చినబాబుని సైలెంట్ గా సెట్ చేస్తున్నారా?

-

ఏమైందో ఏమో గాని ఈ మధ్య టీడీపీలో నారా లోకేష్ కాస్త తక్కువగానే కనిపిస్తున్నారు..పోలిటికల్ స్క్రీన్ పై పెద్దగా కనిపించడం లేదు…కాకపోతే తెరవెనుక మాత్రం చినబాబు…వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు…సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంతే తప్ప….బయటకొచ్చి ప్రజలు తిరగడం తగ్గించారు. అయితే సోషల్ మీడియా లేదంటే మంగళగిరిలో మాత్రమే కనిపిస్తున్నారు.

కరోనా సమయంలో చంద్రబాబు కంటే చినబాబే ప్రజల్లో ఎక్కువ తిరిగిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు,కార్యకర్తలపై కేసులు పెట్టిన, ఇంకా రాష్ట్రంలో ఏదైనా సంఘటనలు జరిగిన చినబాబే వచ్చేవారు. వరుసపెట్టి పర్యటనలు చేసేవారు. కానీ ఏమైందో గాని ఈ మధ్య చంద్రబాబు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు. ఇప్పటికే ఆయన జిల్లాల పర్యటనలు చేస్తూ…మినీ మహానాడు కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే…అలాగే వరద బాధితులని పరామర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు.

ఏది వచ్చిన చంద్రబాబే ఎక్కువ తిరుగుతున్నారు…చినబాబు మాత్రం సోషల్ మీడియాకే పరిమితమవుతున్నారు. అంటే చినబాబుని కావాలని ఆపారా? లేక వేరే ప్లాన్ తో చినబాబుని రంగంలోకి దించుతారా? అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..చినబాబుని పాదయాత్రకు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో చినబాబు…సైకిల్ యాత్ర లేదా పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి కార్యక్రమం ఏదొకటి చేయాలనేది బాబు ఆలోచన…కానీ ఈ వయసులో ఆయన పాదయాత్ర అంటే ఇబ్బంది.

అందుకే తన తనయుడుని ముందు పెట్టాలని చూస్తున్నారు..లోకేష్ పాదయాత్ర వల్ల పార్టీకి ప్లస్. అలాగే లోకేష్ నాయకుడుగా ఇంకా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఆ ప్లాన్ తోనే చినబాబు బయటకు రావడం లేదని తెలుస్తోంది. అతి త్వరలోనే లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వస్తారని సమాచారం. ఇందులో ఎలాంటి డౌట్ లేదని కార్యకర్తలు అంటున్నారు…చూడాలి మరి చినబాబు పోలిటికల్ యాత్ర ఎప్పుడు మొదలవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version