ఆధార్ కార్డు మాదిరిగానే బీసీలకు శాశ్వత సర్టిఫికెట్లు : నారా లోకేశ్‌

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. నేటితో యువగళం పాదయాత్ర 82వ రోజుకు చేరుకుంది. ఈరోజు పాదయాత్ర కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో జరిగింది. కర్నూలు జిల్లా మాధవరం విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం మంత్రాలయంలో బీసీ ప్రతినిధులతో లోకేశ్‌ ముఖాముఖిలో పాల్గొన్నారు.

అక్కడ నారా లోకేష్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు మాదిరిగానే బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీచేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. మంత్రాలయం ఎబోడ్ హోటల్ వద్ద బీసీలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ… ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసే విధానం తీసుకొస్తాం అని వెల్లడించారు.
జగన్ కాన్వాయ్ కి అడ్డం పడుకొని నిరసన తెలిపిన రైతుల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ప్రభుత్వం పై పోరాడాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనకదాసు జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. మాదాసి కురబలకు ఎస్సీ సర్టిఫికేట్ పై తప్పకుండా మేము సర్టిఫికేట్లు ఇస్తాం. బీరప్ప గుడుల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు కేటాయించి, అర్చకులకు జీతాలందిస్తాం” అని హామీల వర్షం కురిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version