టీడీపీలోకి పురంధేశ్వరి… ఒప్పుకుంటారా?

-

ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు! ఒక పక్క ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోతుంటే.. ఓడిపోయిన సీనియర్లు కూడా బై బై బాబూ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాబుకు ఒక ఆలోచన వచ్చిందంట. అదేమిటంటే… వైసీపీలోనూ – బీజేపీలోనూ అసమ్మతి నేతల అందరినీ కలిసి వారిని టీడీపీలో చేర్చుకునే ఎత్తుగడను చంద్రబాబు అమలు చేయబోతున్నారని టీడీపీ వర్గాల టాక్. వారిలో బాబు నోరుతెరిచి అడగలేనివారికి లోకేష్ తో రాయబారాలు పంపిస్తారట. ఈ కొత్త ఆలోచనల అమలు అనేది వాళ్లూ వీళ్లూ ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ తోనే మొదలుపెడదామని బాబు & కో బావిస్తున్నారంట. అందులో భాగంగానే పురంధేశ్వరిని ఎంచుకున్నారని అంటున్నారు.

ఈ విషయంలో బాబు.. పురంధేశ్వరి ఇంటికి వెళ్లి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ముందు నిలబడి పార్టీలోకి ఆహ్వానించలేని పరిస్థితి. కాబట్టి ఈ ఆపరేషన్ కు లోకేష్ ను వాడుతున్నారంట బాబు. అంటే… పెద్దమ్మ పెద్దమ్మా మా పార్టీలోకి రావా అని లోకేష్ అడగబోతున్నారన్నమాట! అది జరగడం పెద్ద విషయమేమీ కాదు.. ఎందుకంటే రాజకీయ అవసరాలకోసం పవన్ ఇంటికే వెళ్లిన బాబుకు.. సొంత వదిన గారింటికి అబ్బాయిని పంపి అడిగించడం చాలా చిన్న విషయమే కానీ… ఆ అహ్వానాన్ని పురంధేశ్వరి మన్నిస్తారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. టీడీపీలోకి నందమూరి ఆడపడుచు వస్తున్నారంటే కేడర్ కు, మిగిలిన నేతలకూ హ్యాపీ నే కానీ.. అసలు ఆమె అందుకు అంగీకరించి, మరిది గారి నాయకత్వంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తారా అన్నదే అసలు సమస్య.

ఈ విషయంలో ఇప్పుడు పార్టీకి నేనే పెద్ద, అన్నీ నేను చూసుకుంటున్నాను.. మిమ్మల్ని కూడా నేనే చూసుకుంటాను అని లోకేష్ మాట ఇస్తాడని… ఆ మాటకు మరోమాట సాయంగా బాలయ్య కూడా వేస్తారని అంటున్నారు. ఇదే జరిగి పురంధేశ్వరి ఒప్పుకుంటే మాత్రం బాబు కొత్త ప్లాన్ వర్కవుట్ అవ్వడం స్టార్ట్ అయినట్లే. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే… టీడీపీ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో నందమూరి కుటుంబం మద్దతు చాలా అవసరం, ఇదే సమయంలో దగ్గుబాటి కుటుంబానికి రాజకీయంగా గట్టి మద్దతు అవసరం. కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్ లో భాగంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఖచ్చితంగా ఆలోచిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version