నేడు పల్నాడుకు నారా లోకేష్..టూర్‌పై పోలీసుల ఆంక్షలు

-

నేడు పల్నాడులో పర్యటించనున్నారు టీడీపీ పార్టీ అగ్ర నేత నారా లోకేష్. అయితే.. ఈ టూర్‌ పై టెన్షన్ నెలకొంది. వైసీపీ నేతల చేతిలో చనిపోయిన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లనున్నారు నారా లోకేష్. అయితే నారా లోకేష్ టూర్ సందర్భంగా ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదని పల్నాడు టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

నారా లోకేషుకు భారీ స్థాయిలో స్వాగత సన్నాహాలు చేస్తోన్నారు పల్నాడు టీడీపీ నేతలు. యరపతినేని ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేపట్టి తీరతామంటోన్నారు పల్నాడు నేతలు.

అయితే.. ర్యాలీలు చేపడితే లోకేషును అడ్డుకునేందుకు సిద్దమవుతోన్నారు స్థానిక పోలీసులు. ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని నోటీసుల్లో స్పష్టం చేస్తున్నారు పోలీసులు. ప్రాణనష్టం, అల్లర్లు జరుగుతాయంటూ నోటీసులివ్వడంపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. ఈ సారి కూడా అడ్డుకునేందుకు సిద్ధం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version