Breaking : ఫ్రాన్స్‌లో కరోనా విజృంభణ.. నిన్న ఒక్క రోజే 50 వేల కేసులు..

-

మరోసారి ప్రపంచ దేశాలను కరోనా రక్కసి భయాందోళనకు గురి చేస్తోంది. మళ్లీ కరోనా విజంభణ కొనసాగుతుండడంతో భారీగా కేసులు నమోదువుతున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా ఇటీవల కరోనా కేసులు పెరగడంతో.. కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేసి.. కరోనాను కట్టడి చేశారు. అయితే.. ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్ ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ పేర్కొన్నారు. స్థానిక టీవీ ఛానెల్‌కు బుధవారం నాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తెలిపారు అలెన్ పిషర్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయాలనేది తన అభిప్రాయమని అన్నారు అలెన్ పిషర్.

‘‘ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఒకటే.. ఈ కొత్త వేవ్ ఎంత తీవ్రంగా ఉండబోతోంది?’’ అని ఫిషర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మిగతా యూరోపియన్ దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5 చాలా వేగంగా పెరుగుతున్నట్లు సమాచారం. ఈ వేరియంట్లు సాధారణ ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు అధికారులు. అయితే భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఫోర్త్‌వేవ్‌ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version