కాకి పిల్ల కాకికి ముద్దు – చినబాబు చంద్రబాబుకి ముద్దు.!

-

లోకేష్ ముఖ్యమా… టీడీపీ ముఖ్యమా అని చంద్రబాబుని ఎవరైనా అడిగితే… లోకేష్ సారధ్యంలోని టీడీపీ ముఖ్యమనే బాబు నుంచి సమాధానం వచ్చి తీరుతుంది. తన కుమారుడి కోసమే బాబు తాపత్రయం అని అందరికీ తెలిసినా… ఒక అడుగు ముందుకేసి… అది నా కుమారుడి కోసం కాదు, ఏపీ భవిష్యత్ కోసం.. భావితరాల భవిష్యత్ కోసం అని చెప్పగల సమర్ధుడు చంద్రబాబు! కాకి పిల్ల కాకికి ముద్దు.. చినబాబు చంద్రబాబుకి ముద్దు! ప్రస్తుతం ఈ విషయాలపైనే మానసికంగా లాజికల్ దాడి షురూ చేస్తున్నారు టీడీపీ నుంచి వైకాపాలోకి వచ్చిన, వస్తున్న, వస్తోన్న నేతలు!

టీడీపీ అంటే కోపం చాలా మంది టీడీపీ నేతలకు లేదు! ఇప్పటికీఇ అది ఎన్టీఆర్ పార్టీ అని నమ్మే చాలామంది హార్డ్ కోర్ పెద్దాయన ఫ్యాన్స్ ఇదే ఫీలింగ్ లో పార్టీతో నడుస్తుంటారు. చంద్రబాబు విధానాలు నచ్చినా నచ్చకపోయినా.. కేవలం ఎన్టీఆర్ పై అభిమానంతో, కేడర్ మాట కాదనలేక నడిచేవారు కూడా అధికం! ఈ క్రమంలో… బాబు అనంతరం బుడ్డోడు వస్తాడని ఆశించిన ఆశాజీవులకు చినబాబు ఎంట్రీతో కడుపు మండిపోయినట్లుంది!

ఇంతకాలం అధికారంలో ఉన్నంతకాలం ఏదోలా భరించారు కానీ… ప్రతిపక్షంలోకి వచ్చిన అనంతరం చినబాబు పై ఇంతకాలం దాచుకున్న ఆగ్రహం అంతా బయటకు కక్కేస్తున్నారు మాజీ టీడీపీ నేతలు! నేడు టీడీపీ ఉన్న పరిస్థితికి పరిపూర్ణంగా చినబాబే కారణం అని నమ్ముతున్న ఒక వర్గం టీడీపీ నేతలు… వైకాపా కండువా కప్పుకున్న అనంతరం చినబాబునే టార్గెట్ చేస్తున్నారు! ఇందులో భాగంగా… తాజాగా వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మైకందుకున్నారు!

లోకేష్ నాయకత్వం పనికి రాదని చెప్పినా చంద్రబాబు వినలేదని మొదలుపెట్టిన ఆయన… “అమరావతి మీద కాదు.. ముందు నీ కొడుకు నాయకత్వం మీద పార్టీలో సీక్రెట్ బాలెట్ పెట్టు” అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీని అనంతరం మంత్రిని చేసి తమపై బలవంతంగా రుద్దారని ఈ మాజీ టీడీపీ నేత చెబుతున్నారు! దీంతో… టీడీపీ నుంచి వైకాపాలోకి వస్తోన్న నేతలంతా చినబాబుపై తమకున్న ఆగ్రహాన్ని ఇప్పటికి బయటపెడుతున్నారన్నమాట! అలా అని బాబు పుత్రోత్సాహాన్ని వదులుకోలేరు కదా… సో… నేతలే పార్టీని వదిలేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version