నాపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు – లోకేష్‌ కు కేతిరెడ్డి వార్నింగ్‌

-

నారా లోకేష్ కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. నాపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని.. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే తేల్చుకుంటానని తేల్చి చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని.. జేసీ బ్రదర్స్ అరాచకాలపై నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీకి లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అని ఫైర్‌ అయ్యారు. ఫోర్జరీ డాక్యూమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్ల చేయించిందని వివరించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమం పై దాడి చేయించారు… జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి లోకేష్ కు గుర్తులేదా అని నిలదీశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version