హీరోయిన్‌తో నారా రోహిత్ పెళ్లి.. ఎప్పుడంటే?

-

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.ఈనెల 13న హైదరాబాద్‌లో ఆయన ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల నారారోహిత్ నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్ గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.నారా రోహిత్‌కి ప్రస్తుతం 40 ఏళ్లు. కాగా,దీనిపై నారా రోహిత్ తరఫు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలాఉండగా, నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్నాళ్ల ముందు ట్రైలర్ రిలీజ్ చేశారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్‌పైనే ఈ మూవీ స్టోరీ ఉండటం విశేషం. ఇక నారా రోహిత్ నిశ్చితార్థం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news