శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. సత్యభామగా భూదేవి జన్మించి శ్రీ మహా విష్ణువు కృష్ణుడుగా సత్యభామ తో పాటు వెళ్తాడు. సతీ సమేతంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి వచ్చి ఎగతాళి చేసిన నరకాసురుడిని ఆమె చేతితో చంపేస్తుంది.
ఆమె చేతిలో ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. అయితే ఈ రాక్షస పీడ వదిలింది అని సంతోషంతో దీపావళి వస్తుంది. నరక చతుర్దశి నాడు నరకాసురుడు బాధలు తొలగిపోతాయి. అందుకనే తర్వాత రోజు అయిన దీపావళి నాడు ఆనందంగా ప్రజలు పండగ చేసుకుంటారు. అయితే ఈరోజు కూడా పాటించాల్సిన ఆచారాలు, పద్ధతులు వున్నాయి. మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.
నరకచతుర్దశి నాడు పాటించాల్సిన పద్ధతులు:
సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి నరకచతుర్దశి నాడు తలస్నానం చెయ్యాలి.
ఈ రోజున సాయంత్రం ఏదైనా ఐదు చోట్ల దీపాలను పెడితే ఎంతో మంచిదట. అలానే దీపావళి పండుగ నాడు పితృదేవతలను సంతృప్తి పరచాలి. దీపాలను వెలిగించి, మతాబులతో వాళ్లకి మనం ఆనందంగా స్వాగతం చెప్పాలి. అందుకే ఎప్పటి నుండో దీపావళి నాడు దీపాలను పెడుతూ వస్తున్నారు.
ఇంకో కధనం ప్రకారం అయితే.. నరక చతుర్దశి రోజు దీపాలు పెడితే స్వర్గానికి వెళ్లేందుకు పెద్దలకు అవి దారి చూపిస్తాయట. అందుకే దీపాలను పెట్టాలని అంటున్నారు.
యమలోకం నుండి విముక్తి పొందే రోజే ఇది:
యమలోకంలో 84 లక్షల నరకాలు వున్నాయి. అయితే నరక చతుర్దశి రోజు వీటి నుండి తప్పించుకునేందుకు ప్రార్ధించాలట. అంత పవిత్రమైన రోజు ఇది. యమలోకం నుండి విముక్తి కల్పించామని మనం నరక చతుర్దశి నాడు పూజించాలి. దానితో ఆయా బాధలు తొలగిపోతాయి.
16 దీపాలను వెలిగించాలా..?
16000 మంది గోపికలకు శ్రీ కృష్ణుడు నరకాసురుడి నుండి విముక్తిని కల్పించి నందున చాలా మంది 16 దీపాలను వెలిగిస్తుంటారు.