నారా లోకేశ్ ఈసారి పోటీ చేసేది ఎక్కడి నుంచో తెలుసా?

-

అమరావతి: టీడీపీ అధినేత తనయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి నుంచే ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే ఈసారి నారా లోకేశ్ నియోజకవర్గం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యే‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి నియోజకవర్గం మారేందుకు ప్రత్యామ్నాలను వెతుకుతున్నారట.

అయితే 2019 ఎన్నికల్లోనే నారా లోకేశ్ పెనమలూరు, భీమిలి నుంచి పోటీ చేయాలనుకున్నారట. ఆ సమయంలో భీమిలీ నియోజకవర్గం నుంచి సబ్బంహరి పోటీలో ఉండటంతో లోకేశ్ తప్పుకున్నారట. ఇప్పుడు ఈస్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. సబ్బంహరి చనిపోవడంతో నియోజకవర్గం బాధ్యతలను ఆయన తీసుకోవాలనుకుంటున్నారట. ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గంగా చూసుకుంటే భీమిలీలో చాలా పట్టున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట.

మంగళగిరిలో ఓడిపోవడంతో చాలా అవమానులను ఆయన ఎదుర్కొన్నారు. అక్కడ సామాజికవర్గంగా చూసుకుంటే మళ్లీ టెన్షన్ పడటం ఎందుకనే అనే భావన ఉందట. పైగా తొలిసారి పోటీ చేసి ఓడిపోవడంతో అచ్చి రాలేదని కూడా అనుకుంటున్నారట. అందుకే ఈసారి నియోజకవర్గం మారితే భీమిలీ కానీ, పెనమలూరు నుంచిగానీ పోటీ చేయాలని లోకేశ్ భావిస్తున్నారట. ఇప్పటికైతే ఇది ప్రచారం మాత్రమే. మరి అప్పటి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version