ఏపీ మంత్రి నారాలోకేశ్ గురువారం తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి అభివృద్ధి పనులపై అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఒక కుప్పం, ఒక హిందూపురం తెలుగుదేశం పార్టీకి ఎలా అయితే కంచుకోటలుగా ఉన్నాయో మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా టీడీపీకి అంతే కంచుకోటగా చేస్తానని ముఖ్యమంత్రి గారికి హామీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా పట్టాలు కావాలన్న ప్రజల కోరికను కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలల్లోనే నెరవేర్చిందన్నారు. తామిచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు.రాబోయే రోజుల్లో మంగళగిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని లోకేశ్ చెప్పుకొచ్చారు.