సురేష్ ప్రొడక్షన్స్ హిస్టరీలోనే అలా ఫస్ట్ టైమ్!

-

సురేష్ ప్రొడక్షన్స్ అంటే తెలుగు నాట ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్నో మరుపురాని క్లాసిక్ హిట్స్‌ను అందించింది. ఎన్నో దశాబ్దాల నుంచి గొప్ప చిత్రాలను అందిస్తూ వస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుత కాలంలో దూకుడు పెంచింది. వరుసగా చిత్రాలు తెరకెక్కిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంది.

రీమేక్‌లపై ఎక్కువ దృష్టి పెట్టిన సురేష్ ప్రొడక్షన్స్ బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంటోంది. రీసెంట్‌గా కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఓ బేబీ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం మరో రీమేక్ పట్టాలపై ఉంది. మరో కొరియన్ మూవీ డ్యాన్సింగ్ క్వీన్‌పై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అసురన్ రీమేక్ అయిన నారప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

నారప్పకు కరోనా దెబ్బ తగిలింది. తమిళనాడులో జరుగున్న నారప్ప షూటింగ్‌కు బ్రేకులు పడ్డట్టు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ హిస్టరీలోనే అతి పెద్ద షెడ్యూల్ అయిన నారప్పను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నామని తెలిపింది. యూనిట్ మొత్తం హైద్రాబాద్‌కు తరలిరానుంది. పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ షూటింగ్ పున:ప్రారంభిస్తామని, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా గుమి గూడకండని సలహాలు ఇస్తూ ట్వీట్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version