తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ..? జమ్మూకాశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకం..?

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టానికి గవర్నర్‌గా ఉన్న ఈఎస్‌ఎల్ నరసింహన్ కొత్తగా ఏర్పడ్డ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రానున్నారట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందట.

ఎంతో కాలంగా నెలకొని ఉన్న కాశ్మీర్ సమస్యకు నేటితో పరిష్కారం దొరికింది. ఇకపై కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్నారు. ఈ క్రమంలోనే వారు దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు జీవించినట్లే ప్రశాంతంగా జీవనం సాగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇకపై జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత్‌లో భాగమైంది. ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేయడంతో ఇకపై ఆ ప్రాంతం మొత్తం భారత్‌లో పూర్తిగా అంతర్భాగం కానుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేయడంతోపాటు జమ్మూకాశ్మీర్, లదాఖ్‌లను రెండు ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకాశ్మీర్, లదాఖ్‌లుగా ఆ ప్రాంతాలు చెలామణీ అవుతాయి. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుండగా, లదాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా చెలామణీ కానుంది. కాగా కొత్తగా ఏర్పడ్డ జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం అప్పుడే లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టానికి గవర్నర్‌గా ఉన్న ఈఎస్‌ఎల్ నరసింహన్ కొత్తగా ఏర్పడ్డ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రానున్నారట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. అందులో భాగంగానే తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను అక్కడికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బదిలీ చేస్తారట. ఇక తెలంగాణకు కొత్త గవర్నర్‌ను కూడా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version