బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంపై బాగా ఫోకస్ చేసింది. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఊపందుకున్న బిజెపి పార్టీ… వరుసగా జాతీయ నేతలను రాష్ట్రానికి దింపుతూ గ్రామస్థాయిలో తమ పార్టీని బలోపేతం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో మోడీ సభ నిర్వహించింది బిజెపి. అటు వరుసగా ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి గుంజుకుంటుంది బిజెపి.
ఇక తాజాగా కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేబినెట్ విస్తరణలో తెలంగాణ రాష్ట్రానికి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని మోడీ ఆలోచన చేస్తున్నారట. తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు.
ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి బాధ్యతలలో ఉన్నారు. ఇటీవల లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది బిజెపి. దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి బిజెపి ఎంపీల సంఖ్య ఐదుకు పెరిగింది. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణలో ఈసారి ధర్మపురి అరవింద్ లేక లక్ష్మణ్ కు కేంద్రమంత్రి ఇవ్వాలని కేంద్ర బిజెపి ఆలోచన చేస్తూ ఉందని సమాచారం. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.