భారత్ ను కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు దేశ ప్రజలందరికీ కీలక సూచనలు చేస్తూ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరోసారి కరోనా వైరస్ పై మాట్లాడిన ప్రధానమంత్రి దేశంలో కరోనా ముప్పు తొలగి పోలేదని… కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు. మహారాష్ట్రలో కరొండు తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ… వ్యాక్సిన్ వచ్చేంతవరకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ నే ఉండాలని అజాగ్రత్త వద్దు అని సూచించారు. ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సూచించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.
ప్రజలందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన కరోనా పంజా విసురుతుంది అంటూ హెచ్చరించారు. డాక్టర్ బాలాసాహెబ్ విక్కీ పాటిల్ ఆత్మకథను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన ప్రధాని ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.