Breaking : అమెరికా మూన్‌ మిషన్‌ వాయిదా

-

నాసా మూన్ మిషన్ ఆర్టెమిస్-1 ప్రస్తుతం వాయిదా పడింది. ఇంజిన్ 3లో లోపం కారణంగా ఈ మిషన్‌ను వాయిదా వేసినట్లు నాసా ట్వీట్ చేసింది. పవర్‌ఫుల్‌ రాకెట్‌ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. హైడ్రోజన్‌ లీకేజీ కారణంగా సోమవారం నాటి ‘ఆర్టెమిస్ 1’ లాంచ్ కౌంట్‌డౌన్‌ను మధ్యలో నిలిపివేశారు. T-40 నిమిషాల వద్ద కౌంట్‌డౌన్ నిలిపివేసినట్లు తెలిపింది నాసా. ఆర్టెమిస్ 1 లాంచ్ డెరెక్టర్‌తో మిషన్‌ ప్రణాళికలను హైడ్రోజన్ బృందం చర్చిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. 1992 డిసెంబర్‌ 7న ప్రయోగించిన అపోలో 17 మిషన్‌తో మానవుడు చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లైంది. ఈ నేపథ్యంలో మరో ప్రతిష్ఠాత్మక మూన్‌ మిషన్‌కు నాసా శ్రీకారం చుట్టింది.

చంద్రుడిపైకి మాన‌వుల‌ను పంపించాల‌న్న లక్ష్యంతో ఆర్టెమిస్‌ ప్రాజెక్టును చేపట్టింది నాసా. దీని కోసం అభివృద్ధి చేసిన అత్యంత శ‌క్తివంత‌మైన, 98 మీటర్ల పొడవైన స్పేస్ లాంచ్ సిస్ట‌మ్‌(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను తొలిసారి నాసా ప్రయోగించనున్నది. దీని ద్వారా ఓరియ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపనున్నది. కాగా, ఆర్టెమిస్-1 ప్రయోగం ద్వారా ఓరియ‌న్ క్యాప్సూల్స్ పనితనాన్ని పరిశీలిస్తుంది నాసా. భవిష్యత్‌ ప్రయోగాల్లో వ్యోమ‌గాముల‌ను మోసుకెళ్లే ఓరియ‌న్ క్యాప్సూల్ భూమి మీదకు రీ ఎంట్రీ, రికవరీని టెస్ట్ చేయ‌నున్న‌ది. అయితే ఫ్లోరిడాలోని ఆధునీక‌రించిన కెన్న‌డీ స్పేస్ సెంట‌ర్ నుంచి సోమవారం తలపెట్టిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version