భూమిలాంటి గ్రహాన్ని గుర్తించిన నాసా.. అక్కడ మనం నివాసం ఉండవచ్చట..!

-

ఈ అనంత విశ్వంలో భూమి లాంటి వాతావరణం ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. అలాంటి గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఎక్కడా భూమి లాంటి గ్రహాలు ఇప్పటి వరకు కనిపించలేదు.

ఈ అనంత విశ్వంలో భూమి లాంటి వాతావరణం ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. అలాంటి గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఎక్కడా భూమి లాంటి గ్రహాలు ఇప్పటి వరకు కనిపించలేదు. దీంతో ఏలియన్స్ ఉంటారా, ఉండరా అనే విషయంపై కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎటూ తేల్చలేకపోయారు. అయితే నాసా సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం.. అచ్చం భూమి లాంటి మరొక గ్రహమే మన సౌరవ్యవస్థకు అవతల ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. దాన్ని ఈ మధ్యే గుర్తించారని వెల్లడైంది.

2016 నుంచి 2017 మధ్య కాలంలో నాసాకు చెందిన అంతరిక్ష టెలిస్కోప్ హబుల్ సేకరించిన డేటాను సైంటిస్టులు విశ్లేషించారు. ఈ క్రమంలో భూమి నుంచి 110 కాంతి సంవత్సరాల దూరంలో అచ్చం భూమిని పోలిన మరొక గ్రహం ఉందని తేల్చారు. దానికి కె2-18బి అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమి కన్నా 8 రెట్లు పెద్దగా ఉంటుందని, దానిపై అచ్చం భూమిని పోలిన వాతావరణం ఉందని, నీరు కూడా ఉందని, దీంతో ఆ గ్రహం మానవ నివాసాలకు అనువుగా ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు.

కాగా సదరు కె2-18బి గ్రహం అక్కడి సౌర వ్యవస్థలో ఉన్న కె2-18 అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నదట. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లే ఆ గ్రహం ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నదట. దీంతో ఆ గ్రహంపై మనుషులు నివాసం ఉండవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ గ్రహంపై ఉన్న వాతావరంలో హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ తదితర వాయువులు కూడా ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఆ గ్రహం మానవ నివాసాలకు ఎంత వరకు అనువుగా ఉంటుందనే విషయంపై మరిన్ని పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. వారి ప్రయోగాలు గనక సక్సెస్ అయితే ఆ గ్రహంపై ఎంచక్కా మనుషులు నివాసం ఉండవచ్చు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version