Breaking : ‘ఎక్స్’ వేదికగా ఇస్రోకు నాసా విషెస్‌

-

చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చారిత్రాత్మకంగా ల్యాండింగ్ చేసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు విజయాన్ని అందించింది. బుధవారం సాయంత్రం 5.20 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. అయితే.. చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతమైనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు, చంద్రుడిపై వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంలో భారత్ నిలిచింది. ఈ మిషన్‌లో మీతో భాగస్వాములైనందుకు మాకు ఆనందంగా ఉంది’’ అని బిల్ ట్వీట్ చేశారు.

చంద్రయాన్-3 విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అత్యంత సమీపంలో వ్యోమనౌకను దింపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అమెరికా చైనా, సోవియట్ యూనియన్ తరువాత విజయవంతంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా కూడా నిలిచింది. ప్రస్తుతం చంద్రుడిపై దిగిన ల్యాండర్ సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తోంది. కాబట్టి.. ఒక రోజు మాత్రమే (చంద్రుడి కాలమానం ప్రకారం) కార్యకలాపాలు నిర్వహించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మరోసటి రోజు సూర్యోదయం తరువాత రోవర్ పునరుజ్జీవం పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version