మూడో టీ20కి వర్షం అంతరాయం

-

మూడో టీ20కి వర్షం అంతరాయం భారత్, ఐర్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచు వర్షం అంతరాయం కలిగింది. మ్యాచ్ జరుగుతున్న డబ్లిన్ స్టేడియం వద్ద భారీ వర్షం కురుస్తోంది. దీంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. వర్షం తగ్గితే టాప్ వేసే అవకాశం ఉంది. కాగా మూడు టీ20ల సిరీస్లో భారత్ ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించు‌కున్నారు. మరోవైపు రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌ టీమిండియా వాడుకోనుంది.

అవేష్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌ ఇప్పటివరకు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. నిజానికి విండీస్‌ పర్యటనలోనూ జట్టులో ఉన్న అవేష్‌ ఖాన్ మొత్తంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితం కావాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించలేకపోతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. సంజు శాంసన్‌కు విశ్రాంతినిచ్చి వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. దేవధర్‌ ట్రోఫీలో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసంతో ఉన్న షాబాజ్‌ అహ్మద్‌ భారత్‌కు మరో ఆల్‌రౌండ్‌ ప్రత్యామ్నాయం. వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్‌ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version