మే 2 తరువాత దేశవ్యాప్త లాక్‌డౌన్‌.. తృణమూల్ కాంగ్రెస్‌ నేత జోస్యం..

-

కరోనా తీవ్రత నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. కొన్ని నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే మే 2వ తేదీ తరువాత దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ జోస్యం చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ముర్షీదాబాద్‌లోని లాల్‌గోలాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

nation wide lock down after may 2nd tmc leader predicts

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్‌లో ఇంకా ఏప్రిల్‌ 22, 26, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిశాక మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తారు. కేవలం ఎన్నికలు ఉన్నాయని చెప్పి, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో గెలిచేందుకే లాక్‌డౌన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తక్షణమే లాక్‌డౌన్‌ను విధిస్తారు. అని అభిషేక్‌ బెనర్జీ అన్నారు.

కాగా దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించగా, ఆ దశలో టీకాలను ఉచితంగా ఇచ్చేది లేదని తెలిపారు. అయితే ఈ విషయంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల తమ రాష్ట్ర ప్రభుత్వంపై పెను భారం పడుతుందని, అసలే కరోనా వల్ల తీవ్రమైన నష్టాల్లో ఉన్నామని, కనుక టీకాలను కేంద్రమే ఉచితంగా అందించాలని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news