ఈ కాలం లో బాలికలు కూడా చక్కగా చదువుకుంటూ గట్టి పోటీని ఇస్తున్నారు. మేము కూడా అన్ని రంగాల్లో రాణించగలమని ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతీ సంవత్సరం భారతదేశంలో జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాము. అయితే ఎందుకు ఈరోజున జాతీయ బాలికా దినోత్సవం జరుపుకోవాలి…? ఎప్పటి నుండి ఇది అసలు మొదలు అయ్యింది…? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి దాని గురించి ఇప్పుడే తెలుసుకోండి.
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొట్టమొదట 2008 లో ఇది ప్రారంభమైంది. ఎలా ప్రారంభించారు అనే విషయానికి వస్తే… దేశంలో ఆడపిల్లల పట్ల వివక్ష ను ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. అలా 2008 లో మొదలైన ఈ జాతీయ బాలికా దినోత్సవంని ఇప్పటికీ దేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది. బాలికల సాధికారత కోసం ప్రచారకార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. బాలికల కోసం ప్రయోజనాలు కూడా కల్పించడం జరుగుతోంది. మహిళలకు సాధికారత కల్పించడం కొరకు, 2015 సంవత్సరం లో బేటీ బచావో బేటీ పడావో ప్రారంభించబడింది. బాలికల భద్రత, విద్య, లింగ నిష్పత్తి, ఆరోగ్యం వంటి అంశాలను ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతి రోజు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
బాలికలకు కూడా సమాన హక్కులు కల్పించాలి. అయితే వివిధ సమస్యలపై కూడా చర్చించడం వంటివి కూడా చేయడం జరుగుతోంది. బాలికలకు, స్త్రీలకి కూడా కలిగే సమస్యలను కూడా లేవనెత్తారు. ప్రతీ ఒక్కరు బాలికలని స్త్రీలని గౌరవించాలి. అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అలానే విలువివ్వడం, గౌరవించడం చేయాలి.