వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్

-

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని జాతీయ మానవ హక్కుల సంఘం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలు తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. ఇక మరోవైపు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంజాబ్, హరియానాలో పంట వ్యర్ధాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మసనం విచారణ చేపట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version