దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రఖ్యాత ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ పరీక్షను షెడ్యూల్ కన్నా ముందే నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. ఈ పరీక్షను తొలుత మే 24న జరపాలని నిర్ణయించారు. కాకపోతే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 11కు మార్పు చేసినట్లు ఎన్‌టీఏ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మే 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పాటు శ్రేష్ఠ ప్రవేశపరీక్ష ఆయా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్ష జరిగిన నాలుగు నుంచి 6 వారాల్లో రిజల్ట్స్ ప్రకటిస్తారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్‌లో https://shreshta.ntaonline.in/ అప్లికేషన్స్ తీసుకొని అవకాశం కల్పిపించనున్నారు
.