ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ ‘ఓపెనైమర్’

-

ఆస్కార్ బరిలో నిలిచి ఏడు అవార్డులు గెలిచిన సినిమా ‘ఓపెనైమర్’ చిత్రం మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. రేపటి నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లిష్లో ఉచితంగా వీక్షించవచ్చు. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. రెండవ ప్రపంచ యుద్ధంలో అణు బాంబును రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఓపెనైమర్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది.

ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో కిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్,ఫ్లోరెన్స్ పగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇందులో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మర్ఫీ నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఏకంగా ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఇక 96వ అకాడమీ అవార్డులు ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నేపథ్య సంగీతం, విభాగాలతో సహా మొత్తం 7 ఆస్కార్ అవార్డులు ఓపెన్ హైమర్ చిత్రం సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news