ఇటీవల బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రాగా, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాధిత మహిళను కోల్ కతాలోని రాజ్భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులను ఆశ్రయించకుండా ఆమెను అడ్డుకున్నందుకు గానూ ముగ్గురు అధికారులపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. రాజభవన్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసిన బాధితురాలు వేధింపుల కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత, ముగ్గురు రాజభవన్ సిబ్బందిపై హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాజభవన్లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్యోగం సాకుతో గవర్నర్ తనను అనేకసార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంటూ ఈ నెల ప్రారంభంలో పోలీసులను ఆశ్రయించింది ఏప్రిల్ 24, మే 2 తేదీల్లో ఆయన తన నివాసంలో తనను వేధింపులకు గురిచేశాడని ఆమె పేర్కొంది. బాధిత మహిళ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కోల్కతా పోలీసులు విచారణ ప్రారంభించారు.