ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. కుంభమేళాకు వెళ్తున్న 10 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది భక్తులు మరణించారు. భక్తులు మహా కుంభమేళాకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

పది మంది భక్తులు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని.. అతి వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో బొలేరో వాహనంలోని భక్తులందరూ మరణించారు. బస్సులో ఉన్న 19 మంది గాయపడ్డారు. మరణించిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కాగా, మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్వరూప రాణి మెడికల్ ఆసుపత్రికి తరలించినట్లు యమునానగర్ డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.